గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (11:44 IST)

శ్రీకాకుళం రణస్థలి వేదికగా జనసేన 'యువశక్తి' సభ

yuvashakthi
శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలి వేదికగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని ఈ యువసభను జరుపుతున్నారు. ఇందులో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగిస్తారు. ఇందుకోసం జిల్లాలోని లావేరు మండలం తాళ్ళవలస సమీపంలో 25 ఎకరాల్లో భారీ ప్రాంగణంలో వేదికను సిద్ధం చేశారు. అలాగే వేదికపై పవన్‌‍తో పాటు వంది మంది ప్రతినిధులు కూర్చునేలా ఏర్పాట్లుచేశారు. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని సన్ రే రిసార్ట్స్‌కు చేరుకున్నారు. 
 
ఈ యువశక్తి సభ మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరుగుతుంది. ఇందులో వంది మంది యువకులు ప్రసంగిస్తారు. సభ ముగింపు సందర్భంగా పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేస్తారు. ముఖ్యంగా, రెండు రాజకీయ తీర్మానాలు చేస్తారు. అలాగే, టీడీపీ జనసేన పార్టీల మధ్య వచ్చే ఎన్నికల్లో పొత్తు ఖాయమనే వార్తలు వస్తున్నాయి. దీంతో వైకాపా నేతలు విపక్ష నేతలను కట్టడి చేసేందుకు బ్రిటీష్ కాలం నాటి చట్టాన్ని తెరపైకి తెచ్చి జీవో నంబర్ 1ని విడుదల చేసింది.
 
అలాగే, స్వామి వివేకానంద జయంతి సందర్భంగా యువతకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. మన జాతి భవిష్యత్ మీదే.. జైహింద్ అంటూ ట్వీట్ చేశారు. "నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? అని రాసివున్న పోస్టరును ట్విట్టర్‌లో ఆయన షేర్ చేశారు.