మంగళవారం, 12 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (08:42 IST)

ఏపీ ప్రజలు సైకిల్‌ను ఇష్టడుతున్నారు : వైకాపా మంత్రి ధర్మాన

dharmana prasada rao
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేయేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి నుంచి ఎన్నికల వాతావరణం నెలకొంది. అదేసమయంలో ఈ ఎన్నికల్లో ఓడిపోతామనే భయం వైకాపా నేతలను వెంటాడుతుంది. అందుకే ముఖ్యమంత్రి జగన్‌ మొదలుకుని మంత్రుల వరకు విపక్ష నేతలపై విరుచుకుపడుుతున్నారు. విపక్ష నేతలు రోడ్లపై తిరగకుండా కట్టడి చేస్తున్నారు. 
 
ఇందుకోసం జీవో నంబర్ 1 పేరుతో ఓ బ్రిటీష్ కాలం నాటి జీవోను తెరపైకి తెచ్చి, పోలీసులతో పక్కాగా అమలు చేస్తున్నారు. అయినప్పటికీ విపక్ష నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో మంత్రులు కొన్ని సందర్భాల్లో వాస్తవ పరిస్థితిపై నోరు జారుతున్నారు. తమ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, టీడీపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుందంటూ ఇటీవల మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఇపుడు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాగే మాట్లాడారు.
 
రాష్ట్ర ప్రజల్లో సైకిల్‌కు ఆదరణ పెరుగుతుందన్నారు. పైగా, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిచి టీడీపీ ప్రభుత్వం ఏర్పాటైతే మళ్లీ అమరావతి రాజధాని అవుతుందన్నారు. అందువల్ల విశాఖ జిల్లాను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యమన్నారు. ఎలాగైనా విశాఖను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. 
 
అయితే, ఈ వ్యాఖ్యలపై విపక్ష నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ధర్మాన డిమాండ ఆచరణసాధ్యం కాదని తెలిసినప్పటికీ ఉత్తరాంధ్ర వాసులను రెచ్చగొట్టి ప్రజల మధ్య విద్వేషాలు పెంచేందుకే ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.