1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 12 జనవరి 2023 (21:26 IST)

సెన్సార్ పూర్తి చేసుకొని విడుద‌లకు సిద్ధం అయిన దేశం కోసం భగత్ సింగ్

desam kosam Bhagat Singh
desam kosam Bhagat Singh
తెలుగు సినీ చరిత్రలో ఎవరూ ఇంతవరకు చేయ‌న‌టువంటి దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల చరిత్రను ఆధారంగా చేసుకుని అద్భుతంగా తెర‌కెక్కించిన‌ చిత్రం `దేశం కోసం భగత్ సింగ్`. గ‌తంలో అన్న‌ల రాజ్యం, నాగ‌మ‌నాయుడు, రాఘ‌వేంద్ర మ‌హ‌త్యం లాంటి చిత్రాల‌ను నిర్మించిన నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్ అధినేత రవీంద్ర గోపాల `దేశం కోసం భగత్ సింగ్` చిత్రాన్ని నిర్మించారు. ర‌వీంద్రజి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
దేశ భక్తి నేపథ్యంలో నిర్మించిన ఈ చిత్రంలో  రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్ ప్రధాన పాత్రలో నటించగా సూర్య, జీవా, ప్రసాద్ బాబు, అశోక్ కుమార్, సుధ నటించగా, మిగిలిన తారాగణం పాత కొత్త  నటీనటుల కలయికలతో నిర్మించారు. సాంకేతిక వర్గం:  కెమెరాః సి. వి. ఆనంద్, సంగీతంః ప్ర‌మోద్ కుమార్‌, మాట‌లుః సూర్యప్ర‌కాష్,రవీంద్ర గోపాల, పాట‌లుః ర‌వీంద్ర గోపాల‌, ఎడిటింగ్ః రామారావు, కోడైరెక్ట‌ర్ః రామారావు, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం, నిర్మాతః ర‌వీంద్ర‌జి. బ్యాన‌ర్ః నాగ‌ల‌క్ష్మి ప్రొడ‌క్ష‌న్స్