బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated: సోమవారం, 9 జనవరి 2023 (11:36 IST)

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మనవడిని కర్రలతో కొట్టి చంపేశారు.. ఎక్కడ?

murder
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే మనవడిని కొందరు దుండగులు కర్రలతో కొట్టి చంపేశారు. మృతుని వయసు 35 యేళ్లు. పేరు హిమన్షు సింగ్. శనివారం రాత్రి పంచయతీకి వెళ్లారు. అక్కడ కొంతమంది వ్యక్తులు ఆయనతో గొడవకు దిగారు. ఆ తర్వాత వారంతా కలిసి కర్రలతో ఆయనను చావబాదారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణం మవు జిల్లాలోని కోపాగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. 35 యేళ్ల హిమాన్షు సింగ్‌ను పాత కక్షల నేపథ్యంలో గ్రామానికి చెందిన ఎడెనిమిది మంది కలిసి కర్రలతో కొట్టి చంపేశారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుుకని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. కాగా, హిమాన్షు తాత దివంగత కేదార్ సింగ్ గత 1980లో ఘోసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.