బుధవారం, 29 మార్చి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated: సోమవారం, 23 జనవరి 2023 (14:34 IST)

సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధం: రాహుల్ గాంధీ

rahul gandhi
దేశంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్‌లో ఒకరిగా పేరొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇటీవల ఓ డిజిటల్ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగారు. సరైన వ్యక్తి దొరికితే పెళ్లికి సిద్ధమని రాహుల్ గాంధీ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.  
 
తనకు కాబోయే భాగస్వామి కోసం నిర్దిష్ట చెక్ లిస్ట్ లేదని, కానీ ప్రేమగా, తెలివైన వ్యక్తి కోసం చూస్తున్నానని పేర్కొన్నారు. ఇలాంటి ప్రశ్నలు అడగడం ద్వారా యాంకర్ తనను ఇబ్బందులకు గురి చేస్తోందని సరదాగా కామెంట్ చేశారు. 
 
తన కాబోయే భాగస్వామి తన తల్లి సోనియా గాంధీ, తన నానమ్మ, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వంటి లక్షణాలను కలిగి ఉంటారని రాహుల్ గాంధీ కొన్ని ఇంటర్వ్యూలలో వెల్లడించారు. 
 
అవి ఒక వ్యక్తిని బలంగా మార్చే లక్షణాలని తాను నమ్ముతానని, అది తన భాగస్వామిలో ఉండాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ప్రస్తుతం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్రతో బిజీగా ఉన్నారు.