సోమవారం, 27 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 27 అక్టోబరు 2025 (17:21 IST)

కపుల్స్ సొసైటీ నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్న కథతో సంతాన ప్రాప్తిరస్తు

Suresh Babu, Vikrant, Madhura Sridhar Reddy
Suresh Babu, Vikrant, Madhura Sridhar Reddy
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. ఆయ్, సేవ్ ది టైగర్స్ చిత్రాలకు పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ 'తెలుసా నీ కోసమే..' పాటను బ్యూటిఫుల్ గా కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు. ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో..
 
స్క్రీన్ ప్లే రైటర్ షేక్ దావూద్. జి. మాట్లాడుతూ - జనాభాలో భారత్ చైనాను దాటేసింది. మనది ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం. మరోవైపు ఐవీఎఫ్, ఫర్టిలిటీ సెంటర్స్ చాలా పెరిగాయి. ఎందుకు అనే పాయింట్ ను డిస్కస్ చేస్తూ ఎంటర్ టైనింగ్ వే లో రాసుకున్న స్టోరీ ఇది. మంచి ఎంటర్ టైనింగ్ మూవీ. మీరంతా ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో మంచి వినోదం ఉంటుందని మేమంతా గట్టిగా చెప్పగలం. మా సినిమాకు మీరంతా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ - నేను ఇటీవల వరుసగా ఎంటర్ టైనింగ్ మూవీస్ చేస్తూ వస్తున్నాను. ఆయ్, సేవ్ ది టైగర్స్, త్రీ రోజెస్..ఇలాంటి ఎంటర్ టైనర్స్ చేస్తున్న టైమ్ లో శ్రీధర్ గారు పిలిచి "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా చూడమన్నారు. ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయమని అడిగారు. ఈ మూవీ చూస్తున్నంత సేపూ ఎంతో ఆర్గానిక్ ఫీల్ కలిగింది. అలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్న క్రమంలోనే తెలుసా నీ కోసమే కంపోజ్ చేశాం. బీజీఎం నుంచి వచ్చిన సాంగ్ ఇది. శ్రీమణి బ్యూటిఫుల్ గా రాశాడు, అర్మాన్ బాగా పాడాడు. నా మ్యూజిక్ టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచే కథ మొదలైంది. పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గానీ ఇతర ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తున్నాం. ఈ పాయింట్ తో "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం.

మా క్లోజ్ సర్కిల్ లో సినిమా చూసిన వారంతా చాలా బాగుందని చెబుతున్నారు. చిన్న చిత్రాలకు ఉండే రిలీజ్ ప్రాబ్లమ్స్ గురించి మన అందరికీ తెలిసిందే. అయితే మాకు సురేష్ ప్రొడక్షన్స్ ఉంది అనే ధైర్యంతో ముందడుగు వేస్తుంటాం. మేము చేసిన సినిమాలన్నీ సురేష్ సంస్థ ద్వారానే డిస్ట్రిబ్యూట్ అవుతుంటాయి. ఈసారి డిజప్పాయింట్ చేయము అని చెప్పి సురేష్ బాబు గారికి మాటిచ్చాను. ఈ కథకు విక్రాంత్ యాప్ట్ అనేది మీకు సినిమా చూశాక తెలుస్తుంది. చాందినీ బాగా నటించింది. తరుణ్ భాస్కర్, వెన్నెల కిషోర్, అభినవ్ వీళ్లంతా మంచి రోల్స్ చేశారు. మరో మూడు వారాల్లో మీ ముందుకు రాబోతున్నాం. మీ అందరి సపోర్ట్ మాకు దక్కుతుందని ఆశిస్తున్నాం. అన్నారు.
 
డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు. ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో లైటర్ వేన్ లో మూవీ వెళ్తుంటుంది. మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు మూవీకి కావాల్సిన ఆర్టిస్టులతో పాటు ప్రొడక్షన్ పరంగా కావాల్సినవన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు. మా హీరో విక్రాంత్ మూవీలో కంటే బయటే అందంగా ఉంటాడు ఎందుకంటే మా సినిమాలో అతను సాప్ట్ వేర్ ఇంజినీర్. వాళ్లు ఎలా కనిపిస్తారో అలా విక్రాంత్ మేకోవర్ ఉంటుంది. విక్రాంత్ మాకు బాగా సపోర్ట్ చేశాడు. తెలుసా నీకోసమే పాటను అజయ్ గారు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నుంచి సాంగ్ లా కంపోజ్ చసి తీసుకొచ్చారు. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే కెమిస్ట్రీ ఈ పాటలో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఇంత బాగా వచ్చేందుకు ప్యాషనేట్ గా వర్క్ చేసిన నా టీమ్ అందరికీ థ్యాంక్స్. అన్నారు.
 
హీరో విక్రాంత్ మాట్లాడుతూ - కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్ లు ఇవ్వకుండా లైట్ హార్టెట్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పుట్టిన యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీలో ఉంది. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ కు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి. అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ తెలుసా నీ కోసమే. ఈ పాటకు శ్రీమణి మంచి లిరిక్స్ ఇచ్చారు, అర్మాన్ మాలిక్ బాగా పాడారు. సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, ఫ్యామిలీ వ్యాల్యూస్ చెబుతుంది. ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.
 
నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ - మధుర శ్రీధర్ నాకు మంచి మిత్రులు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ తో ఉంటారు. ఆయన ఎఫర్ట్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. "సంతాన ప్రాప్తిరస్తు" సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ కు కంగ్రాట్స్. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.