శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 22 జనవరి 2023 (11:59 IST)

ప్రియుడికి ఆర్థిక సాయం.. నిలదీసిన తండ్రి.. చాకుతో కుమార్తె దాడి

knife
ఏపీలోని విశాఖపట్టణంలో దారుణం జరిగింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లోని బంగాలు ఆభరణాలు, నగదును తన ప్రియుడికి ఇచ్చింది. ఈ విషయం తెలుసుకున్న తండ్రి కుమార్తెను నిలదీశాడు. దీంతో ఆగ్రహించిన కుమార్తె.. కన్నతండ్రిపై చాకుతో దాడి చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
విశాఖపట్టణం శంకరమఠం వెనుక వీధిలో ఒక కేటరింగ్ వ్యాపారి తన కుమారుడు, కుమార్తెతో కలిసి నివాసం ఉంటున్నాడు. భార్య లేకపోవడంతో తన ఇద్దరు పిల్లలే సర్వస్వంగా భావించి జీవిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ వ్యాపారి కుమార్తె స్థానికంగా ఉండే ఓ కాలేజీలో చదువుతుంది. ఇక్కడ చదివే మరో స్నేహితురాలి ద్వారా ఓ యువకుడు పరిచయమయ్యాడు. అతనితో యువతి ప్రేమలోపడింది.
 
ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని పలు దఫాలుగా నమ్మించాడు. దీంతో పలు దఫాలుగా ఇంట్లోని బంగారు ఆభరణాలతో పాటు నగదును తన ప్రియుడికి ఇచ్చింది. ఈ విషయం తెల్సిన తండ్రి కుమార్తెను నిలదీశాడు. ఈ విషయం తన ప్రియుడికి చెప్పాడు. 
 
మీ నాన్నను ఎదో ఒకటి చేస్తే మనకు అడ్డు ఉండదు. ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటా అంటూ రెచ్చగొట్టాడు. ప్రియుడి మాటలు నమ్మిన బాలి శుక్రవారం ఉదయం చాకుతో తండ్రి మెడపై వెనుక నుంచి పొడిచింది. దీంతో ఆయన తీవ్రంగా గాయపడటంతో సమీపంలోని ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు.