1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 19 జనవరి 2023 (12:14 IST)

విశాఖనగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్ల కలకలం..

drugs injections
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక తీర ప్రాంతంగా ఉన్న విశాఖ నగరంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు కలకలం సృష్టించాయి. చిత్తుకాగితాల వ్యాపారం పేరుతో మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్న వ్యక్తిని దువ్వాడ పోలీసులు అరెస్టు చేశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... ఆటోనగర్‌ సమీపంలోని యాదవ జగ్గరాజుపేటలో స్క్రాప్‌ వ్యాపారం చేస్తున్న మహేశ్వర్‌రెడ్డిగా గుర్తించారు. ఈయన మత్తు ఇంజెక్షన్లు విక్రయిస్తున్నట్టు స్థానికులు గుర్తించారు. 
 
ఇదే విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఆటోనగర్‌ యాదవ జగ్గరాజుపేట సమీపంలోని అపెరల్‌ పార్క్‌ రోడ్డులోని ఓ స్క్రాప్‌ దుకాణంలో తనిఖీలు నిర్వహించగా 35 మత్తు ఇంజెక్షన్లు, గంజాయి నింపిన సిగరెట్లు, కొంత గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
దీనికి సంబంధించి ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కోల్‌కతా నుంచి ఇంజెక్షన్లు తెప్పించి నగరంలో విక్రయిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పూర్తి విచారణ చేపట్టనున్నారు.