శనివారం, 2 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (13:12 IST)

మైనర్ అమ్మాయి... అందరి ముందు తాళి కట్టేసిన అబ్బాయి...

marriage
మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్న వేళ.. తాజాగా ఏపీలో బాలికకు పబ్లిక్ గానే తాళికట్టేశాడు ఓ వ్యక్తి. వివరాల్లోకి వెళితే.. ఉరవకొండ మండలంలోని ఓ గ్రామంలో కొంతకాలంగా ఎనిమిదో తరగతి చదువుతోన్న 14 ఏళ్ల బాలిక వెంటపడ్డాడు శ్రీకాంత్. కానీ బాలిక కూడా ఆ యువకుడిని ప్రేమించింది. 
 
ఇద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోంది. అయితే వీరి ప్రేమకు కుటుంబీకులు నో చెప్పారు. పెళ్లికి తర్వాతే అమ్మాయితో తిరగాలని కండీషన్ పెట్టారు. దీంతో బాలిక ఇంటికి వెళ్లిన శ్రీశాంత్ అందరి ముందే పబ్లిక్ గా తాళికట్టేశాడు. 
 
దీనికి బాలిక నుంచి కానీ, వారి కుటుంబ సభ్యుల నుంచి కానీ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం కాలేదు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యింది. మొత్తానికి మైనర్ బాలికను పెళ్లి చేసుకోవడం ప్రస్తుతం సంచలనంగా మారింది.