ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (10:13 IST)

స్మార్ట్ బ్రైడ్... బెంగళూరులో ట్రాఫిక్.. కారు దిగి మెట్రో ఎక్కింది...

Bride
Bride
దేశంలో  ప్రధాన నగరాల్లో బెంగళూరు ఒకటి. అయితే ఐటీ నగరం కావడంతో ట్రాఫిక్ కూడా హైదరాబాద్ తరహాలో భారీగా వుంటుంది. తాజాగా బెంగళూరు ట్రాఫిక్‌లో ఇరుక్కోకుండా వుండేందుకు వధువు సూపర్ ఐడియా చేసింది. 
 
బెంగళూరు ట్రాఫిక్‌ను నివారించేందుకు వధువు కారులోంచి దిగి.. మెట్రో ఎక్కింది. బెంగళూరులోని ఒక వధువు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. అంతే అక్కడ నుంచి మెట్రో ఎక్కింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ వీడియోను పీక్ బెంగళూరు అని పేరు పెట్టారు. 
 
బెంగుళూరు వధువు భారీ ట్రాఫిక్ మధ్య తన పెళ్లి మండపానికి సమయానికి చేరుకోవడానికి తన కారును వదిలివేసి, మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచింది. 
 
వధువు ఆభరణాలు ధరించి, పూర్తి మేకప్‌తో మెట్రోలో ప్రయాణిస్తున్నట్లు చూపించే వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమెపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించింది. 
 
ఆమెను "స్మార్ట్ బ్రైడ్" అని పిలుస్తున్నారు. ఈ వీడియో 3000 కంటే వ్యూస్ కలిగి వుంది. మెట్రో జర్నీ ద్వారా ఆమె మండపానికి చేరుకుంది.