ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఠాగూర్

యూట్యూబ్ సంపాదనతో లగ్జరీ కారు కొనుగోలు చేసిన బిహార్ వాసి

audi car
బిహార్ రాష్ట్రానికి చెందిన ఓ యువకుడు యూట్యూబ్ ద్వారా వచ్చిన ఆదాయంతో ఏకంగా లగ్జరీ కారు ఆడిని కొనుగోలుచేసి ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పైగా, కోట్లాది మంది నిరుద్యోగులకు ఆయన మార్గదర్శిగా నిలిచారు. కోవిడ్ లాక్డౌన్ సమయం నుంచి యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ లక్షలాది రూపాయల మేరకు ఆదాయాన్ని అర్జిస్తూ వచ్చిన ఆ యువకుడు.. తాను సంపాదించిన ఆదాయంలో కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ వచ్చాడు. 
 
ఫలితంగా రూ.50 లక్షల విలువైన ఆడి కారు కొన్నాడు. ప్రస్తుతం దీన్ని పశువుల దొడ్డి దగ్గర ఉంచుతున్నాడు. ఔరంగాబాద్‌‍లోని జసోయా ప్రాంతానికి చెందిన 27 యేళ్ల హర్ష్ రాజ్‌పుత్ యూట్యూబ్‌లో కామెడీ వీడియోలు చేస్తూ నెలకు రూ.8 లక్షల మేరకు సంపాదిస్తున్నాడు. థాకడ్ అనే న్యూస్ రిపోర్టర్ పేరుతో రకరకాల సమస్యలపై కామెడీ వీడియోలు చేస్తూ నవ్విస్తున్నాడు. ప్రస్తుతం అతడి యూట్యూబ్‌‍ను ఏకంగా 33 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఫాలోఅవుతున్నారు.