సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2022 (17:14 IST)

స్వీటీ అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుందా?

Anushka Shetty
స్వీటీ అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుందని టాక్ వస్తోంది. మంగళూరుకి చెందిన యోగా టీచర్‌ అయిన ఈమె 2005లో సూపర్‌ చిత్రంతో నాగార్జునకు జంటగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రంలో అందాలను ఆరబోసిన అనుష్క ఆ తరువాత కూడా చాలా చిత్రాల్లో గ్లామరస్‌ పాత్రలకే పరిమితమయ్యారు. అరుంధతి చిత్రం ఒక్కసారిగా ఆమె కెరీర్‌ను మార్చేసింది. అందులో జేజమ్మగా తన అభినయంతో ప్రేక్షకుల నుంచి జేజేలు అందుకున్నారు.
 
ఆ తరువాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుత నటనతో ప్రేక్షకులను అబ్బురపరిచారు. అయితే సైజు జీరో చిత్రం అనుష్క నట జీవితాన్ని ఒక్కసారిగా తలకిందులు చేసేసిందనే చెప్పాలి. అందులో పాత్ర కోసం అనుష్క బరువుని భారీగా పెంచేసుకుంది. ఆ తరువాత బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయింది. దీంతో సినిమా ఆమెను దాదాపు పక్కన పెట్టేసింది. 
 
అనుష్క చివరగా నటించిన చిత్రం నిశ్శబ్దం. అది ఎలాంటి శబ్దం లేకుండానే థియేటర్ల నుంచి నిష్క్రమించింది. ఆపై ప్రభాస్‌తో పెళ్లంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిపై ఇద్దరూ స్పందిస్తూ తాము మంచి ఫ్రెండ్స్‌ అని క్లారిటీ ఇచ్చారు.
 
ఇలాంటి పరిస్థితుల్లో 42 వయసును టచ్‌ చేస్తున్న అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతోందని టాక్ వస్తోంది. తాజాగా తెలంగాణకు చెందిన ఓ గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలు స్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది ప్రశార్థకమే.