ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 25 సెప్టెంబరు 2022 (11:48 IST)

తెలంగాణాలో తల్లి, ఇద్దరు కవల పిల్లలు ఆత్మహత్య

తెలంగాణ రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఓ తల్లి తన ఇద్దరు కవల పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన పాలమూరు జిల్లా నవాబ్ పేట మండలం కాకర్లపాడులో విషాదం చోటు చేసుకుంది. మరో చిన్నారి మాత్రం ప్రాణాలతో బయటపడింది. 
 
మృతులను తల్లి రమాదేవి, కవల పిల్లలు మేఘన, మారుతి మృతి చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ముగ్గురు పిల్లలను నల్లకుంటలోకి తోసిన తల్లి, ఆ తర్వాత తాను కూడా దూకి ఆత్మహత్య చేసుకుంది. చెరువు నుంచి సురక్షితంగా పెద్ద కుమార్తె నవ్య బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.