బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపడీనం, ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో హైదరాబాద్ నగరంలో జోరుగా వర్షం కురుస్తుంది. పలుచోట్ల కురిసిన వర్షానికి నగరవాసులు తడిసి ముద్దయ్యారు. రహదారులపైకి నీరు రావడంతో వాహనాదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. మరో నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం తెలిపింది.
ముఖ్యంగా, భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సోమాజిగూడ, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట, మాదాపుర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొండాపుర్లో భారీ వర్షం కురిసింది. వెంగల్‌రావునగర్, యూసఫ్‌గూడ, మైత్రివనం, ముషీరాబాద్, చిక్కడపల్లి, లోయర్ ట్యాంక్‌బండ్, బాగ్‌లింగంపల్లి, కవాడిగూడ, బోలక్‌పుర్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షం కురుస్తోంది.
అలాగే, దోమలగూడ, గాంధీనగర్, జవహర్‌నగర్, గుడిమల్కాపూర్, మెహదీపట్నం,కార్వాన్, లంగర్‌హౌస్, జియాగూడ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. శంషాబాద్, ఆరాంఘర్, రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, గండిపేట్, మణికొండ, నార్సింగి, మియాపూర్, చందానగర్, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నామా, బార్కస్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.