సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్

నేపాల్‌లో వర్ష బీభత్సం - కొండ చరియలు విరిగిపడి 17 మంది మృతి

nepal floods
నేపాల్ దేశంలో భారీ వర్ష బీభత్స కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అనేక లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో పలు ప్రాంతాల్లో సంభవించిన వేర్వేరు సంఘటనల్లో 17 మంది మృతి చెందారు. మరో 11 మందిని రెవెన్యూ సిబ్బంది రక్షించారు. 
 
క్షతగాత్రులను హెలికాఫ్టర్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అలాగే, భారీ వర్షాల కారణంగా గల్లంతైన వారి కోసం అధికారులు గాలిస్తున్నారు. అనేక రహదారుల్లో కొండచరియలు విరిగిపడటంతో రోడ్లపై వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే, ఈ వర్ష బీభత్సం కారణంగా మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు.