సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (08:16 IST)

ఇంజనీరింగ్ పనులు - బెజవాడ మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

trains
పట్టాలకు మరమ్మతులు, ఇతర ఇంజనీరింగ్ పనుల కారణంగా విజయవాడ మీదుగా నడిచే అనేక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు ఈ రైళ్ళను రద్దు చేశారు. ఈ రైళ్లలో విజయవాడ, కాకినాడ, విశాఖపట్టణం నుంచి రైళ్లతో పాటు గుంటూరు మాచర్ల, గుంటూరు నడికుడి మధ్య నడిచే రైళ్లు ఉన్నాయి. ఈ రద్దు అయిన రైళ్లను ఓసారి పరిశీలిస్తే,
 
కాకినాడ పోర్ట్-విశాఖపట్టణం (17267/17268), కాకినాడ-విజయవాడ (17257/17258), విజయవాడ-గుంటూరు (07783), గుంటూరు-తెనాలి (07887), విజయవాడ-గుంటూరు(07628), గుంటూరు-రేపల్లె (07786), రేపల్లె-తెనాలి (07873), తెనాలి-గుంటూరు (07282), గుంటూరు-విజయవాడ (07864), విజయవాడ-గుంటూరు (07464), గుంటూరు-విజయవాడ (07465), తెనాలి-రేపల్లె (07888), రేపల్లె-మార్కాపురం (07889), మార్కాపురం-తెనాలి (07890), తెనాలి-విజయవాడ(07630) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
 
గుంటూరు-మాచర్ల (07779/07780) మధ్య నడిచే రైళ్లను గుంటూరు-నడికుడి మధ్య రద్దు చేశారు. అలాగే, విజయవాడ-మాచర్ల (07781/07780) రైళ్లను విజయవాడ-నడికుడి మధ్య రద్దు చేశారు.