గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 ఆగస్టు 2022 (09:10 IST)

తిరుమల భక్తుల రద్దీ: తితిదే వీఐపి బ్రేక్ దర్శన్ ఆగస్టు 21 వరకూ బంద్

tirumala
భక్తుల రద్దీ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానం శనివారం వీఐపీ బ్రేక్ దర్శనాన్ని రద్దు చేసింది. టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు వరుస సెలవుల కారణంగా తిరుమలకు భక్తుల రద్దీ అంచనాకు మించి వుంది. ఈ కారణంగా టీటీడీ సిఫార్సు లేఖలపై ఆగస్టు 21 వరకు వీఐపీ దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు తెలిపారు. సాధారణ భక్తులకు వేంకటేశ్వరుని దర్శనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

 
శ్రీవారి సాలకట్ల (వార్షిక) బ్రహ్మోత్సవాలు సెప్టెంబరు 27 నుండి అక్టోబర్ 5 వరకు మహా ధార్మిక ఘట్టం జరగనున్నాయి. “బ్రహ్మోత్సవాలలో ప్రముఖ వాహన సేవలు అక్టోబర్ 1న గరుడ వాహన సేవ, అక్టోబర్ 2న స్వర్ణ రథం, అక్టోబర్ 4న రథోత్సవం, అక్టోబర్ 5న చక్రస్నానం” అని తెలియజేశారు.

 
ధ్వజారోహణం కార్యక్రమం కారణంగా మొదటి రోజు, పెద్ద శేషవాహనం రాత్రి 9 గంటలకు ప్రారంభమవుతుంది. మిగిలిన అన్ని రోజులలో ఉదయం 8 నుండి 10 గంటల వరకు మరియు సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి.