శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 జనవరి 2022 (11:13 IST)

సంచలన నిర్ణయం తీసుకున్న షర్మిల.. పార్టీ కమిటీలన్నీ రద్దు

తెలంగాణా రాష్ట్రానికి చెందిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్. షర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. తన పార్టీకి సంబంధించిన అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. తద్వారా రానున్న రోజుల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా ఆమె అడుగులు వేస్తున్నారు.

ఇందులోభాగంగా, కింది స్థాయి నుంచి పార్టీని ప్రక్షాళన చేసేందుకు ఆమె శ్రీకారం చుట్టారు. అందుకే పార్టీకి చెందిన అన్ని విభాగాల కమిటీలను రద్దు చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఈ కమిటీల స్థానంలో సమన్వయకర్తలను నియమిస్తున్నట్టు తెలిపారు. 
 
తెలంగాణాలో తన తండ్రి వైఎస్ఆర్ పేరును కలిసివచ్చేలా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని గత యేడాది స్థాపించారు. ఆ తర్వాత పార్లమెంట్ నియోజకవర్గాల వారిగీ సమన్వయకర్తలను నియమించారు. రాష్ట్ర స్థాయిలో అధికార ప్రతినిధులను, సోషల్ మీడియా ఇన్‌చార్జీలను నియమించారు. అయితే, ఇపుడు అన్ని కమిటీలను ఒక్కొక్కటిగా రద్దు చేయడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.