ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 25 డిశెంబరు 2021 (12:04 IST)

అవి నీచమైన వ్యాఖ్యలు: మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా వైఎస్ షర్మిల

మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు బాడీ షేమింగ్ కామెంట్లపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలను తను ఖండిస్తున్నట్లు చెప్పారు షర్మిల.

 
తన ట్వీట్లో షర్మిల పేర్కొంటూ... ఒక తల్లిగాను, రాజకీయ నాయకురాలిగా ఇంత నీచమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

 
చిన్నపిల్లలు, మహిళల పట్ల చేసే నీచమైన వ్యాఖ్యలను ఎవరు చేసినా రాజకీయాలను పక్కనపెట్టి స్పందించాలంటూ ట్వీట్లో పేర్కొన్నారు.