మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: మంగళవారం, 9 నవంబరు 2021 (20:16 IST)

వైఎస్ షర్మిలకు వలస కూలీ షాకింగ్ ప్రశ్న

రాజన్న రాజ్యం స్థాపిద్దామని చెబుతూ తెలంగాణా రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు షర్మిళ. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పటికే పలు ప్రాంతాల్లో పాదయాత్రలో తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఏ మాత్రం అలసిపోకుండా తన పాదయాత్రను నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నారు.

 
అడుగడుగునా పాదయాత్రలో ప్రభుత్వం వైఫల్యాన్ని ఎండగడుతూ ముందుకు సాగుతున్నారు షర్మిళ. నిరుద్యోగ సమస్యపైనే ఎక్కువగా మాట్లాడుతున్నారు. అలాగే రైతు సమస్యలపై కూడా గళమెత్తుతున్నారు. 

 
షర్మిళ పాదయాత్రను అధికారపార్టీ నేతలతో పాటు మిగిలిన పార్టీలు కాంగ్రెస్, బిజెపిలు ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో షర్మిళ పాదయాత్ర కొనసాగుతోంది. అయితే పాదయాత్రలో షర్మిళ అనూహ్యరీతిలో ఒక వలసకూలీ నుంచి ఇబ్బంది పడాల్సి వచ్చింది.

 
వలసకూలీ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. రాజన్న రాజ్యం తెస్తానయ్యా అంటూ ఒక వలకూలీ దగ్గరకు వెళ్ళారట షర్మిళ. దీంతో ఆ కూలీ షర్మిళను తదేకంగా చూస్తూ మేమంతా పనికి రాష్ట్రాన్ని వదిలి వలస వచ్చేశాము.

 
ఇప్పుడు తెలంగాణా రాష్ట్రంలో ఉన్నాము. దీంతో షర్మిళకు ఏం చెప్పాలో అర్థం కాక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయారట. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారట.