మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 8 నవంబరు 2021 (11:17 IST)

20వ రోజు వైయస్ షర్మిల ప్రజాప్రస్థానం

సోమవారం ఉదయం 9.30 నిమిషాలకు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం రవిగూడెం గ్రామం నుంచి వైయస్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ప్రారంభించారు. అక్కడి నుంచి ఉదయం 10.00 గంటలకు కాచాలపోరం గ్రామం వద్దకు పాదయాత్ర చేరుకుది. ఉదయం 11.00 గంటలకు పాలిమెలా క్రాస్ మీదుగా పాదయాత్ర సాగింది.

ఉదయం 11.15 నిమిషాలకు ఊకొండి గ్రామం మీదుగా పాదయాత్ర సాగింది. మధ్యాహ్నం 12.00 గంటల నుంచి మధ్యాహ్నం 3.00 గంటల వరకు భోజనం విరామం ఉంటుంది.

అనంతరం మధ్యాహ్నం 3.00 గంటలకు ఊకొండి గ్రామం దగ్గర నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు సింగారం క్రాస్ మీదుగా పాదయాత్ర సాగుతుంది. సాయంత్రం 4.00 గంటలకు పులిపాలుపుల క్రాస్ మీదుగా పాదయాత్ర ముందుకు సాగుతుంది.

సాయంత్రం 4.30 నిమిషాలకు రాత్ పల్లి గ్రామంలో మాట ముచ్చట నిర్వహిస్తారు. సాయంత్రం 5.30 నిమిషాలకు ఎలికట్ట క్రాస్ వద్దకు పాదయాత్ర చేరుకుంటుంది. సాయంత్రం 6.00 గంటలకు ఎలికట్ట క్రాస్ వద్ద పాదయాత్ర ముగుస్తుంది.