బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 20 జనవరి 2022 (10:58 IST)

అమెరికాలో 5G సేవలు ప్రారంభం: ప్రపంచవ్యాప్తంగా 215 విమానాలు రద్దు

సెల్ ఫోన్ సిగ్నళ్ల కారణంగా పిచ్చుకలు చనిపోయాయని పలు నివేదికలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అధిక ఫ్రీక్వెన్సీ ఉపయోగం కారణంగా వాటి ప్రభావానికి పలు పక్షి జాతులు అంతరించిపోయినట్లు జంతు సంరక్షకులు చెపుతూనే వున్నారు.

 
ఇదిలావుండగానే అమెరికాలో తాజాగా 5 G సేవలు ప్రారంభించారు. దీని ఫలితంగా 215 విమానాలు రద్దయ్యాయి. అధిక ఫ్రీక్వెన్సీ వల్ల గాలిలో ఎగిరే విమానాలకు ప్రమాదం వుంటుందని అభిప్రాయాలు వెలువడ్డాయి.

 
ఈ నేపధ్యంలో అమెరికాలోని కొన్ని విమానాశ్రయాల చుట్టూ 5జి సర్వీసుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఐనప్పటికీ పలు దేశాలు అమెరికాకు విమాన రాకపోకలను నిషేధించాయి. దీనితో సుమారు 215 విమానాలు రద్దయ్యాయి.