శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (22:45 IST)

అమెరికాలో ప్రతి సెకనుకు 9 కరోనా పాజిటివ్ కేసులు

అగ్రరాజ్యం అమెరికాలో కరోనా వ్యాప్తి తారాస్థాయికి చేరింది. కరోనా ఉధృతి దెబ్బకు ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. రోజుకూ లక్షలాది సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీనికి నిదర్శనమే అమెరికాలో ప్రతి సెకనుకు తొమ్మిది కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కోవిడ్ కేసులతో పాటు.. ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు కూడా భారీగానే నమోదవుతున్నాయి. 
 
దీనికి నిదర్శనమే సోమవారం ఒక్క రోజే ఏకంగా 14 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత వారం రోజులుగా ఈ అగ్రరాజ్యంలో నమోదైన పాజిటివ్ కేసుల వివరాలను పరిశీలిస్తే ప్రతి సెకనుకు 9 పాజిటివ్ కేసుల చొప్పున నమోదవుతున్నాయని వైద్య నిపుణులు వెల్లడించారు. 
 
కరోనా రెండో వేవ్ సమయంలోనూ అమెరికాలో భయానక పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే. అపారమైన ప్రాణనష్టాన్ని ఎదుర్కొంది. ఇపుడు థర్డ్ వేవ్ సమయంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాబోయే వారాల్లో అమెరికాను కరోనా మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.