శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (22:43 IST)

శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్-తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు

trains
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతున్న కారణంగా హైదరాబాద్ - తిరుపతి మార్గంలో ప్రత్యేక రైళ్లు నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సెప్టెంబర్‌ 16న హైదరాబాద్‌ నుంచి తిరుపతికి, 17న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. 
 
వీటితోపాటు నాగర్‌సోల్ - హైదరాబాద్‌, నర్సాపూర్‌-యశ్వంత్‌పూర్‌ మధ్య స్పెషల్‌ ట్రైన్స్ నడుస్తాయని ప్రకటించింది. హైదరాబాద్‌ నుంచి నాగర్‌సోల్‌కు, ఈ నెల 15న నాగర్‌సోల్‌ నుంచి హైదరాబాద్‌కు, బుధవారం నర్సాపూర్‌ - యశ్వంత్‌పూర్‌కు, గురువారం యశ్వంత్‌పూర్‌ నుంచి నర్సాపూర్‌కు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు.