ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (17:45 IST)

వ‌ర్క్ మూడ్‌లో కూల్‌గా మ‌హేష్‌బాబు - నమ్రతశిరోద్కర్

Mahesh Babu  look
Mahesh Babu look
మహేశ్‌బాబు తాజాగా ఈరోజు షూటింగ్‌లో జాయిన్ అయ్యాడు.  మహేశ్‌ సెట్స్‌లో అడుగుపెట్టి ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ చెప్పిన విష‌యాన్ని ఆస‌క్తిగా వింటున్న ఫొటోను చిత్ర బృందం షేర్‌ చేసింది. అందులో త్రివిక్రమ్‌, మహేశ్‌, చిత్ర యూనిట్‌ కొందరు కనిపిస్తున్నారు. హారిక – హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్‌తో మహేశ్‌బాబు చేస్తున్నమూడో చిత్రమిది. 
 
కాగా, నమ్రతశిరోద్కర్ తాజాగా మ‌హేష్‌కు చెందిన ఓ ఫోటీను పెట్టి వ‌ర్క్ మూడ్ ఆన్ అయింది. చాలా కూల్‌గా వున్నాడంటూ ఇన్‌స్ట్రాలో పోస్ట్ చేసింది. కొత్త హెయిర్‌స్టైల్‌, లైట్‌ గడ్డంతో ఉన్న లుక్‌లో మహేశ్‌ ఆకట్టుకుంటున్నారు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌హేష్ రాజ‌మౌళి సినిమాకు డేట్స్ ఇవ్వ‌నున్నాడు.