ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:43 IST)

చంద్ర‌ముఖి 2 కోసం మారాను, ఆశీర్వ‌దించండి - రాఘ‌వ లారెన్స్

Raghava Lawrence
Raghava Lawrence
డాన్స‌ర్‌, న‌టుడు, ద‌ర్శ‌కుడు, నిర్మాత‌, స‌మాజ‌సేవ‌కుడు అయిన రాఘ‌వ లారెన్స్ తాజాగా త‌న అప్‌డేట్‌ను ప్రేక్ష‌కుల‌ముందుంచాడు. ముఖ్యంగా రెండు విష‌యాల‌ను మీతో షేర్ చేసుకోవాల‌నుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో పేర్కొన్నారు. మొద‌టిది.. నేను చంద్ర‌ముఖి 2 సినిమాకోసం బాడీని ఇలా మార్చుకున్నాను. ఇందుకు నా ట్రైన‌ర్ శివ మాస్ట‌ర్ వ‌ల్ల ఇలా బ‌లంగా త‌యార‌య్యాను. అందుకు మీ దీవెన‌లు కావాలి. రెండోది ఏమంటే.. నేను నిర్వ‌హిస్తున్న ట్ర‌స్ట్‌కు చాలామంది దాత‌లు వెన్నంటి వుండి ప్రోత్స‌హిస్తున్నారు. ఇందుకు వారికి పేరుపేరునా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.
 
మీరంద‌రూ ఇచ్చి స‌పోర్ట్‌తో ఎన్నో మంచి ప‌నులు చేస్తున్నాను. ప్ర‌స్తుతం నేను మంచి స్థితిలో వున్నాను. మంచి సినిమాలు కూడా చేయ‌బోతున్నాను. ఇక‌నుంచి నా పూర్తి సేవ‌ల‌ను ట్ర‌స్ట్ ద్వారా చేయాల‌నుకుంటున్నాను. మా స‌పోర్ట‌ర్లంద‌రికీ ఒక‌టే విజ్ఞ‌ప్తి చేస్తున్నాను. ఇక‌నుంచి లారెన్స్ ఛారిట‌బుల్ ట్ర‌స్ట్‌కు ఎటువంటి డొనేష‌న్లు ఇవ్వ‌వ‌ద్దు. నాకు కేవ‌లం మీ దీవెన‌లే కావాలి.త్వ‌ర‌లో మీ అంద‌రినీ క‌లిసి థ్యాంక్స్ చెప్పాల‌నుకుంటున్నాను. సేవే దైవం.. అంటూ లారెన్స్ నోట్ విడుద‌ల చేశారు.