బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 14 సెప్టెంబరు 2022 (11:03 IST)

సైమా అవార్డులు ఉత్సాహాన్నిచ్చాయి- అల్లు అర్జున్‌

Allu Arjun, Sukumar, Devi Sri Prasad, Buchi Babu and others
Allu Arjun, Sukumar, Devi Sri Prasad, Buchi Babu and others
ఇటీవ‌ల బెంగుళూరులో జ‌రిగిన SIIMA-2022 అవార్డులు త‌న‌కు మ‌రింత ఉత్సాహాన్నిచ్చింద‌ని పుష్ప హీరో అల్లు అర్జున్ అన్నారు. ఆయ‌న త‌న టీమ్‌తో అవార్డుల‌ను ప‌ట్టుకుని ఆనందంతో వున్న పిక్ నేడు విడుద‌ల చేశారు. పుష్ప చిత్రానికి ఏడు, ఉప్పెనకు నాలుగు  అవార్డులు రావ‌డం చాలా ఆనందంగా వుంద‌ని చిత్ర నిర్మాత‌లు మైత్రీమూవీమేక‌ర్స్ వ్య‌క్తం చేశారు. 
 
2021 సెన్సేషనల్ హిట్ పుష్ప: ది రైజ్ బ్లాక్ బస్టర్ సినిమా అత్యున్నత స్థాయిగా పరిగణించబడింది. జ‌నాద‌ర‌ణ‌, అద్భుతమైన సంగీతంతో  అవార్డులకు విలువైనది చిత్ర యూనిట్ భావిస్తోంది. 
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ తాజా ఎడిషన్ బెంగళూరులో వారాంతంలో జరిగింది. కొన్ని పెద్ద కేటగిరీల్లో అవార్డుల వర్షం కురిపించడం ద్వారా రెండు సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. 
 
సూపర్ టాలెంటెడ్ సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప సినిమా మొత్తం 7 అవార్డులను కైవసం చేసుకుంది. వివరాలు ఇక్కడ ఉన్నాయి:
ఉత్తమ చిత్రం
ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌కు అద్భుతమైన అవార్డు దక్కింది
ఉత్తమ దర్శకుడు: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ 
ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్
ఉత్తమ గీత రచయిత: చంద్రబోస్
ఉత్తమ సహాయ నటుడు
ఉత్తమ కళా దర్శకుడు
 
సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఉప్పెన 4 అవార్డులను కైవసం చేసుకుంది.
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: సుకుమార్ ఆశ్రిత బుచ్చి బాబు సన.
బెస్ట్ డెబ్యూ హీరో: పంజా వైష్ణవ్ తేజ్
బెస్ట్ డెబ్యూ హీరోయిన్: కృతి శెట్టి
ఉత్తమ కళా దర్శకుడు
రెండు సినిమాలూ కమర్షియల్‌గా మాత్రమే కాకుండా గొప్ప కంటెంట్‌ని కూడా కలిగి ఉన్నాయని నిరూపించాయి.