వైజాగ్‌లో ఈవెనింగ్ వాకింగ్‌కు వెళ్లిన మహిళ దారుణ హత్య
విశాఖపట్టణంలో ఓ వివాహిత దారుణ హత్యకుగురైంది. ఈవెనింగ్ వాక్‌కు వెళ్లిన ఆ మహిళను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేశారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. విశాఖ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. శ్రావణ సంధ్య (30) అనే వివాహిత భర్తతో గొడవలు కారణంగా పిల్లలతో కలిసి వేరుగా అక్కయ్యపాలెం చెక్కుడురాయి ప్రాంతంలో నివాసం ఉంటోంది.
ఆమెకు ఇద్దరు కుమారులు. ఒకరిని వసతి గృహంలో ఉంచి చదివిస్తుండగా మరొక కుమారుడికి మతిస్థిమితం సరిగా లేకపోవడంతో తన దగ్గరే ఉంచుకుంటూ పెంచుతోంది. బంధువుల ఆర్థిక సహాయం, కుమారునికి వచ్చే పింఛను మీదే జీవనం సాగిస్తోంది. తన ఇంటికి సమీపంలో ఉండే శ్రీనివాస్(47) కార్పెంటర్ వృత్తి చేస్తుంటాడు. శ్రీను ఈమెతో గతంలో తరచూ గొడవ పడుతుండేవాడు.
ఇటీవల ఆమెను తిట్టడంతో గట్టిగా మందలించింది. అప్పటి నుంచి తనపై కక్ష పెంచుకున్న శ్రీను బుధవారం సాయంత్రం పూటుగా మద్యం తాగి వాకింగ్‌కు వెళ్లేందుకు బయటకు వచ్చిన సంధ్యను వెనుక నుంచి కత్తితో పీక కోసి పరారయ్యాడు.
తీవ్రరక్తస్రావంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు సీఐ ఉమాకాంత్, ఎస్ఐ వెంకట రావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే గాలింపు చేపట్టి రైల్వేస్టేషన్ సమీపంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.