శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (08:03 IST)

రామ్‌చ‌ర‌ణ్ ఆర్‌.సి.15 గురించి స‌రికొత్త అప్‌డేట్‌

Humans Qureshi, Sureshgopi,
Humans Qureshi, Sureshgopi,
రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తున్న ఆర్‌సి15 చిత్రం గురించి ఒక్కో విష‌యం బ‌య‌ట పెడుతున్నారు. ఇటీవ‌లే రామ్‌చ‌ర‌ణ్ త‌ను మేక‌ప్ వేసుకున్న త‌ర్వాత స్టిల్‌ను మిర్ర‌ర్‌లో చూపిస్తూ అభిమానుల‌ను సంద‌డి చేశారు. అంత‌కుముందు ఈ సినిమాలో విల‌న్‌గా ద‌ర్శ‌కుడు ఎస్‌.జె. సూర్య న‌టిస్తున్న‌ట్లు ఆయ‌న పిక్‌ను కూడా పెట్టి, వెల్‌క‌మ్ మై బోర్డ్ అంటూ చ‌ర‌ణ్ ట్వీట్ చేశాడు. 
 
తాజాగా ఆర్‌.సి. 15కు సంబందించిన మ‌రో అప్‌డేట్ ఈరోజు ఉద‌య‌మే చేశారు. ఇందులో హుమాన్స్ ఖురేషి, మ‌ల‌యాళ న‌టుడు సురేష్‌గోపి న‌టిస్తున్నారు. పెద్ద బిజినెస్ మేగ్జెట్‌గా వీరు న‌టిస్తున్నారు. వీరిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లుగా పాత్ర‌లు ప్లే చేస్తున్నారు. వీరిద్ద‌రివీ నెగెటివ్ షేడ్స్ వున్న పాత్ర‌ల‌ని అప్‌డేట్‌లో తెలియ‌జేశారు. బిజినెస్‌మేన్ టు పాలిటిక్స్‌లో వెళ్ళే ప్ర‌య‌త్నంలో వారు చేసే రాజ‌కీయాలు ఈ చిత్రంలో స‌రికొత్త‌గా వుంటాయ‌ని తెలుస్తోంది. హుమా ఖురేషి ఇటీవ‌లే అజిత్ వ‌లిమై న‌టించింది. సురేష్ గోపీ చాలా కాలం త‌ర్వాత తెలుగులో న‌టిస్తున్నాడు.