త్వరలో షూటింగ్‌లు మొదలుపెడతాం - దిల్‌రాజు
ఆగస్టునెల 1నుంచి షూటింగ్‌లు బంద్ నిర్వహించి తెలుగు సినీరంగ నిర్మాతలంతా పలుసార్లు మీటింగ్ వేసుకుని సమస్యల గురించి చర్చించారు. వాటి సారాంశాన్ని సినిపెద్ద దిల్‌రాజు ఈరోజు వివరించారు.
దిల్‌రాజు మాట్లాడుతూ, ముఖ్యంగా ఓటీటీ లో సినిమాలు 8వారాల తర్వాత ఇవ్వాలనేది నిర్ణయించాం. మ మల్టీప్లెక్స్.లో టికెట్ ధర, పాప్ కార్న్, కోక్‌లు ప్రేక్షకులకు అందుబాటులో వుండేలా చేస్తున్నాం.
వి.పి.ఎఫ్ ఛార్జీస్ ఇంకా చర్చల్లో వుంది.
సింగిల్ థియేటర్ల ఎగ్జిబిటర్లతో రేపు మీటింగ్ వుంది. త్వరలోనే షూటింగ్‌లు మొదలు పెడతాం.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌తో నిర్మాణవ్యయం, వేస్ట్ కాస్ట్ ఏది జరుగుతుందో చర్చించి `మా`తో అగ్రిమెంట్ చేసుకున్నాం. నిన్న వారు ఇ.సి. మీటింగ్ లో చర్చించి . ఈరోజు మా కమిటీతో ఫైనల్ చేశారు వారు.
ఇంకా మూడు రోజులవకు మీటింగ్ లు వున్నాయి.
ఫెడరేషన్‌తో చర్చలు జరుగుతున్నాయి. వేతనాల గురించి సమస్య పెద్దగా లేదు. వర్కింగ్ కండిషన్ గురించి చర్చించాలి.
అంతేకాకుండా
మన తెలుగు ఇండస్ట్రీ ఏమేమి తీర్మానాలు చేసిందో అని బాలీవుడ్ కూడా వెయింటింగ్‌లో వుంది. దక్షిణాది చిత్ర సీమ కూడా మనవి అమలు చేయడానికి సిద్ధంగా వున్నారు అని దిల్ రాజు తెలిపారు.