శుక్రవారం, 4 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 12 ఆగస్టు 2022 (17:33 IST)

సోని లివ్ ఓటీటీలో తమిళ్ రాకర్స్ వెబ్ సిరీస్

Arun Vijay, Vani Bojan, Aruna Guha, Arivajhagan
Arun Vijay, Vani Bojan, Aruna Guha, Arivajhagan
సినిమా విడుదలైన గంటల్లోనే వెబ్ సైట్‌లో అప్ లోడ్ చేస్తూ దక్షిణాది  చిత్రాలకు కీడు చేస్తున్న "తమిళ్ రాకర్స్" గురించి ప్రేక్షకులకు పరిచయం ఉంది. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది అనే నేపథ్యంతో ప్రముఖ నిర్మాణ సంస్థ రూపొందించిన వెబ్ సిరీస్ తమిళ్ రాకర్స్. ఈ సినిమాలో అరుణ్ విజయ్, వాణి బోజన్ ప్రధాన పాత్రల్లో నటించారు. అరుణ నిర్మాణ సారథ్యంలో దర్శకుడు అరివఝగన్ రూపొందించారు. సోని లివ్ ఓటీటీలో ఈనెల 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.
 
దర్శకుడు అరివఝగన్ మాట్లాడుతూ...తమిళ్ రాకర్స్ దక్షిణాది చిత్రాలతో పాటు  బాలీవుడ్ కు కూడా ప్రమాదకరంగా తయారయ్యారు. వీళ్లు ఎలా పనిచేస్తున్నారు అనే అంశాన్ని కథగా చేసుకుని ఈ వెబ్ సిరీస్ రూపొందించాం. వాళ్లు సినిమాలను ఎలా ఫిల్మింగ్ చేస్తున్నారు. ఎలా అప్ లోడ్ చేస్తున్నారు. వీళ్లు ఇలా కొత్త సినిమాలను వెబ్ సైట్ పెట్టడం వల్ల ఏ ప్రయోజనం ఆశిస్తున్నారు. వీళ్ల నెట్ వర్క్ ఎలా పనిచేస్తోంది. అనే ప్రశ్నలకు మా చిత్రంలో సమాధానం చెప్పబోతున్నాం. ఇందులో భాగంగా జరిగే ఇన్వెస్టిగేషన్ లో అరుణ్ విజయ్, వాణి బోజన్ కీలక పాత్రల్లో ఆకట్టుకుంటారు. అన్నారు. 
 
హీరో అరుణ్ విజయ్ మాట్లాడుతూ...దర్శకుడు అరివఝగన్ తో గతంలో రెండు చిత్రాలు ఈరమ్, కుట్రమ్ 23లో నటించాను. ప్రస్తుతం ఆయనతో బార్డర్ అనే సినిమా చేస్తున్నాను. ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ప్రతిసారీ ఆయన సినిమాలు చేస్తుంటారు. తమిళ్ రాకర్స్ గురించి మనకు తెలుసు. ఈ సిరీస్ ద్వారా వాళ్ల ముఠాను వెలుగులోకి తీసుకురావాలని ప్రయత్నించాము. ఒక సినిమా మేకింగ్ లో ఎంత శ్రమ ఉంటుందో మీకు తెలుసు. ఆ కష్టం ఇలా పైరసీ వల్ల దోపిడీకి గురవుతోంది. మనం వీళ్లను పట్టించడం ఈ సమస్యకు ఒక పరిష్కారం అయితే రెండోది ప్రేక్షకులు ఎవరూ పైరసీ సినిమాలు చూడకుండా బహిష్కరించాలి. అప్పుడే తమిళ్ రాకర్స్ లాంటి వెబ్ సైట్స్ పతనం అవుతాయి. అన్నారు. 
 
నిర్మాత అరుణ గుహ మాట్లాడుతూ...మా ఏవీఎం సంస్థ అనేక భారతీయ భాషల్లో చిత్రాలను నిర్మించింది. తొలిసారి ఒక వెబ్ సిరీస్ ను నిర్మించాం. ఓటీటీ, సినిమా రెండూ మనకు ముఖ్యమే. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా మనమూ మారాలి.  ఈ వెబ్ సిరీస్ తో  ఫిల్మ్ ప్రొడక్షన్ లో మా బౌండరీస్ ను మరింత విస్తృతం చేశాం. ప్రేక్షకులు చూడకుంటే ఇలాంటి సైట్ లు తగ్గిపోతాయి. ఏవైనా ఇలాంటి యాప్ లు ఉన్నా వాటిని బ్లాక్ చేయొచ్చు. ఈ వెబ్ సిరీస్ తో వాస్తవ ఘటనలను కల్పిత సన్నివేశాలతో కలిపి తెరకెక్కించాం. 
 
హీరోయిన్ వాణి బోజన్ మాట్లాడుతూ...ఈ వెబ్ సిరీస్ లో సంధ్య అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ పాత్రలో నటించేందుకు నేను పర్సనల్ గా ఎలాంటి హోమ్ వర్క్ చేయలేదు. దర్శకుడు ఎలా చెబితే అలా నటించాను. ఎలా కనిపించాలి, సంధ్య మేకోవర్ ఎలా ఉంటుంది అనేది మొత్తం దర్శకుడి ఛాయిస్ నే ఫాలో అయ్యాను. ఈ వెబ్ సిరీస్ మీకొక మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుభూతిని పంచుతుంది. అని చెప్పింది.