దిల్‌రాజు, అల్లు అరవింద్ వంటి పెద్దలకు షాకింగ్ ఇచ్చిన నట్టికుమార్
ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు, ఎగ్జిబిటర్ నట్టికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారంనాడు ఆయన మాట్లాడుతూ, నెలరోజులపాటు షూటింగ్ ఆపేసిన పెద్దమనుషులకు షాకింగ్ న్యూస్ చెబుతున్నా వినండి. థియేటర్లకు ప్రేక్షకులు రావడంలేదు. సినిమాలు చూడడంలేదని అన్నారు. కంటెంట్ వుంటే ఎన్ని ఓటీటీలున్నా, హోమ్ థియేటర్లు వున్నా జనాలకు నచ్చితే చూస్తారనేందుకు ఇటీవలే రిరిలీజ్ అయిన పోకిరి, ఘరానామొగుడు, తమ్ముడు, జల్సా సినిమాలే నిదర్శనం. అభిమానులే కాదు. అందరూ చూస్తున్నారు.
అలాంటిదే నేను ఈనెల 8న ధనుష్, శ్రుతిహాసన్ నటించిన కొలవరి 3 అనే సినిమాను రీరిలీజ్ చేస్తున్నాను. అందుకోసం తెలంగాణలో 75 థియేటర్లు పెట్టాం. చాలామంది నీకు పిచ్చెక్కిందా! అన్నారు. కానీ నాకు నచ్చి ధనుష్ సినిమాను విడుదలచేస్గున్నట్లు ప్రకటించాను. నా మాట నమ్మి కొందరు ఎగ్జిబిటర్లు థియటర్లు ఇచ్చారు. 75 థియేటర్లు అన్ని ఆటలకు ఇప్పటికే హౌస్‌ఫుల్స్ అయ్యాయి. ఇంకా ఆంద్రలో కూడా విడుదల చేయబోతున్నాం. దీన్నిబట్టి కంటెంట్ వుంటే ఎప్పుడైనా సినిమాలు చూస్తారు అని నిజమైందని తెలిపారు.
ఛాంబర్ అధ్యక్షులుగా వారే వుండాలి
ఇప్పుడు ఇండస్ట్రీలో నెలకొన్న పరిస్థితులు వల్ల ప్రభుత్వంలో చాలా పనులు చేయించుకోవాలి. కార్మికుల సమస్యలతోపాటు టికెట్‌రేటు, ఎగ్జిబిటర్ల సమస్యలు వున్నాయి. అవన్నీ తీరాలంటే తెలుగు ఫిలింఛాంబర్ అధ్యక్షులుగా ఎవరెవరో వుండడం కాదు. దిల్‌రాజు, అల్లు అరవింద్‌గారు కరెక్ట్ అని నా వ్యక్తిగత అభిప్రాయం అని నట్టికుమార్ తెలిపారు.