గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2022 (14:45 IST)

మళ్లీ పట్టాలెక్కిన కమల్ హాసన్ "ఇండియన్-2"

indian2 movie still
విశ్వ నటుడు కమల్ హాసన్, సెన్సేషనల్ దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం "ఇండియన్-2". లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. రెండేళ్ల క్రితం ఆగిపోయిన ఈ చిత్రం షూటింగ్ మళ్లీ  బుధవారం నుంచి చెన్నైలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు శంకర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. 
 
ఈ చిత్రంలో పాత నటీనటులే నటిస్తున్నారు. అయితే, అకాల మరణం చెందిన తమిళ హాస్య నటుడు వివేక్ స్థానంలో మాత్రం కొత్తగా గురు సోమసుందరం అనే తమిళ నటుడిని తీసుకోనున్నారు. మిగిలిన పాత్రల్లో పాత నటీనటులో నటించనున్నారు. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ నటిస్తున్నారు. అలాగే, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా వంటి అనేక మంది నటీనటులు నటిస్తున్నారు. 
 
తమిళ హీరో, ఎమ్మెల్యే రెడ్ జెయింట్ మూవీస్ అధినేత ఉదయనిధి స్టాలిన్‌ కూడా భాగస్వామిగా చేరి లైకా ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. చెన్నైలో బుధవారం నుంచి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైనప్పటికీ చిత్రం విడుదల తేదీని మాత్రం బహిర్గతం చేయలేదు.