నలుపు రంగు దుస్తులు, నల్లటి కళ్ళ జోడుతో రామ్‌చరణ్ లేటెస్ట్ లుక్
మెగా పవర్ స్టార్ ఇటీవలే తన సోదరీమణులు, మేనకోడళ్ళతో వీకెండ్ హాలీడేస్‌కు వెళ్ళి వచ్చారు. అనంతరం తన షూటింగ్ పనిలో బిజీ అయ్యారు. శనివారంనాడు షూట్‌లో మేకప్ రూమ్‌లో తను తయారవుతున్న ఫొటోలను పోస్ట్ చేశారు. నలుపు రంగు దుస్తులు, నల్లటి కళ్ళ జోడుతో అద్దం పట్టుకుని తన ఫేస్‌ను చూపిస్తూ కనిపించారు.
ఆర్ ఆర్ ఆర్. సినిమా తర్వాత రామ్ చరణ్, తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ యాక్షన్ సినిమాను చేస్తున్నారు. దీని షూటింగ్ చాలా భాగం పూర్తయింది. రామ్ చరణ్ స్టైలీష్ లుక్‌లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రస్తుతం అవి వైరల్ అవుతున్నాయి.
కొందరు నెటిజన్లు, అభిమానులు కిరార్ లుక్‌తో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ అంటూ రీట్వీట్‌లు చేస్తున్నారు.
కాగా, తాజాగా ఆర్‌సి15 సినిమాలో విలన్‌గా ఎస్ జే సూర్య నటించనున్నారని ప్రకటించారు.. దీనికి సంబంధించి సూర్య ఫొటో కూడా రిలీజ్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ భారీ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.