ఆదివారం, 5 ఫిబ్రవరి 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated: శనివారం, 24 సెప్టెంబరు 2022 (09:29 IST)

తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై కసరత్తు.. ఎంతంటే?

students
తెలంగాణలో ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుపై సవరణ ముగిసింది. ఇంజినీరింగ్‌ ఫీజుల సవరణపై తెలంగాణ ఫీజ్‌, అడ్మిషన్స్‌ అండ్‌ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) చేపట్టిన కసరత్తులో భాగంగా ఈ ఏడాది బీటెక్‌ కనిష్ఠ ఫీజు రూ.45వేలు, గరిష్ఠ ఫీజు ఎంజీఐటీలో రూ.1.60లక్షలుగా ఖరారైంది. 10 నుంచి 12 కాలేజీల్లో ఫీజులు లక్షకుపైగా ఉన్నట్టు టీఏఎఫ్‌ఆర్‌సీ పేర్కొంది. 
 
పలు కాలేజీలు తప్పుడు లెక్కలు చూపాయని, ఆడిటింగ్‌ లోపాల కారణంగా ఫీజుల్లో భారీ తేడాలున్నాయని  టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు వెల్లడించారు. ఫీజుల ఖరారుకు టీఏఎఫ్‌ఆర్‌సీ అధికారులు ఈ నెల 20, 21, 22న 90కి పైగా కాలేజీలను విచారణకు పిలిచి పరిశీలించారు. 
 
వీటిన్నింటిపై కూలంకషంగా ఓ నివేదికను రూపొందించారు. శనివారం నిర్వహించే టీఏఎఫ్‌ఆర్‌సీ కమిటీ సమావేశం ముందు ఆ నివేదికను ప్రవేశపెట్టనున్నారు. అధిక ఫీజు రాబట్టాలన్న ఒక కాలేజీ గుట్టు రట్టు అయింది. గతంలో చేపట్టిన విచారణ ప్రకారం టీఏఎఫ్‌ఆర్‌సీ పలు కాలేజీలకు ఫీజులు ఖరారు చేసింది.