బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2022 (22:37 IST)

మూడేళ్ల చిన్నారి తల్లిని కాల్చి చంపేసింది.. సౌత్ కరోలినాలో..?

అమెరికాలో మూడేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు తన తల్లిని కాల్చి చంపేసింది. ఈ ఘటన సౌత్ కరోలినాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మూడేళ్ల పసిపాపకి అనుకోకుండా తుపాకీ లభించింది.
 
అంతే ఆ చిన్నారి ఆ తుపాకీని పట్టుకుని ఆడుకోవడం ప్రారంభించింది. దీన్నీ చూసిన చిన్నారి తల్లి వెంటనే అప్రమత్తమై ఆమె వద్ద నుంచి లాక్కునేందుకు యత్నించింది.
 
ఐతే చిన్నారి నుంచి లాక్కునే క్రమంలో తల్లిపై ప్రమాదవశాత్తు కాల్పులు జరిపింది ఆ చిన్నారి. ఆ ప్రమాదంలో చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడింది. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిందని ఆ చిన్నారి అమ్మమ్మ వెల్లడించారు.