గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : గురువారం, 15 సెప్టెంబరు 2022 (12:56 IST)

తల్లి ప్రేమ ముందు ఏ దేవుడైనా తలదించాల్సిందే... ప్రాణం పోతున్నా ఆ కోతి..?

monkey
తల్లి ప్రేమ ముందు ఏ దేవుడైనా తలదించాల్సిందే. అంతటి మాతృమూర్తి ఆ తల్లి. ఓ కోతి రోడ్డు దాటుతుంది. ఆ తల్లిని పట్టుకుని కోతిపిల్ల వుంది. కానీ ఇంతలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రోడ్డు దాటుతున్న ఆ కోతిని లారీ ఢీ కొట్టింది. అయినా ఆ చిన్నపిల్లకు తన ప్రాణాలంటే తన కడుపు నిండితే చాలనుకుంది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రెండు రోజుల క్రితం ఓ కోతి తన పిల్లతో పాటు రోడ్డు దాటబోతుండగా లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లికి తీవ్ర గాయాలైనా.. పొట్ట కింది భాగంలో ఉన్న పిల్లకు ఎలాంటి దెబ్బ తగలకుండా కాపాడుకుంది. ఈ ఘటన చూసిన వారంతా చలించిపోయారు. అంతేగాకుండా వాహనాలు నడిపేవారు.. జాగ్రత్తతో నడిపివుంటే ఆ కోతికి ఈ దుస్థితి వచ్చేది కాదని కామెంట్ చేస్తున్నారు,