గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:45 IST)

సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాం - తల్లి మృతి

mani sharma mother
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
నాలుగేళ్ల క్రితం మణిశర్మ తండ్రి చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు తల్లి కూడా ఆయన నుంచి దూరమయ్యారు. దీంతో మణిశర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. 
 
ఆదివారం వేకువజామున సినీ నటుడు కృష్ణంరాజు మృతి చెందారు. ఆయన మృతి నుంచి టాలీవుడ్ తేరుకోక ముందే ఇపుడు మణిశర్మ తల్లి చనిపోవడం చిత్రపరిశ్రమ ప్రముఖులను మరింత విషాదంలోకి నెట్టేసింది.