1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Yashoda Telugu Teaser

యశోద టీజర్ రిలీజ్.. గర్భవతిగా సమంత..? (video)

Yashoda Telugu Teaser
Yashoda Telugu Teaser
టాలీవుడ్ సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన "యశోద" సినిమా త్వరలో తెరకెక్కుతోంది. సస్పెన్స్‌తో కూడిన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా నుంచి రీసెంట్‌గా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్‌లో సమంత గర్భవతిగా కనిపిస్తోంది. ఆ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను గురించి ఆమెకి ఓ లేడీ డాక్టర్ చెబుతూ ఉంటే, అందుకు భిన్నమైన .. భయానకమైన పరిస్థితులను యశోద ఎదుర్కొంటున్నట్టుగా చూపించారు. 
 
యశోదకి అలాంటి పరిస్థితులు ఎందుకు ఎదురయ్యాయి? దానికి కారకులు ఎవరు? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు. సినిమాకి వెళ్లాలనే కుతూహలాన్ని పెంచేలానే ఈ టీజర్‌ను కట్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి హరి - హరీశ్ దర్శకత్వం వహించారు.

 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
పుష్ప సినిమాతో మంచి గుర్తింపు లభించింది - అక్షర