సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (14:46 IST)

తెలంగాణా రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Jobs
తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్ ప్రకారం వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. అయితే, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. దీంతో అనేక ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వరుసగా నోటిఫికేషన్లు జారీచేస్తున్నారు. తాజాగా, ఆ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 23 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 13 నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు ఈ పోస్టులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. 
 
ఆయా శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీ కోసం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. దీంతో వరుసగా నోటిఫికేషన్లను జారీచేస్తున్నారు. ఇందులోభాగంగానే ఈ పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పోస్టులకు వచ్చే 13వ తేదీ నుంచి అక్టోబరు 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, రాత పరీక్ష తేదీని తర్వాత వెల్లడిస్తామని టీఎస్ పీఎస్‌సీ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించింది.