ఏపీలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల కోసం నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీ విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం తాజాగా నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్‌ను రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ (ఆర్జేయూకేటీ) మంగళవారం విడుదల చేసింది. ఈ నోటిఫికేష్ ప్రకారం మంగళవార మధ్యాహ్నం నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ దరఖాస్తులు చేసుకునేందుకు గడువు తేదీని సెప్టెంబరు 19వ తేదీ వరకు ఇచ్చారు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు. ప్రత్యేక కేటగిరీలు మినహా నాలుగు క్యాంపస్ విద్యార్థుల ప్రొవిజనల్ జాబితా 29వ తేదీన విడుదలవుతుందని పేర్కొంది.
ఆ తర్వాత అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు క్యాంపస్‌లలో సర్టిఫికేట్ల పరిశీలన, అదే నెల 17వ తేదీ నుంచి తరగతుల ప్రారంభమవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.