శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 29 ఆగస్టు 2022 (22:15 IST)

విజయవాడలో తమ మొట్టమొదటి స్టూడియోతో ఏపీలో హోమ్‌లేన్‌ కార్యకలాపాలు

Interior
రాష్ట్రంలో వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చేందుకు సుప్రసిద్ధ హోమ్‌ ఇంటీరియర్‌ బ్రాండ్‌ హోమ్‌లేన్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో తమ  మొట్టమొదటి స్టూడియోను ప్రారంభించినట్లు వెల్లడించింది. రాష్ట్రంలో సంస్థకు ఇది రెండవ స్టూడియో కాగా తొలి స్టూడియో విశాఖపట్నంలో ఉంది. దాదాపు 60 లక్షల రూపాయల పెట్టుబడితో అత్యాధునికంగా తీర్చిదిద్దిన ఈ స్టూడియో 1497 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా వినియోగదారులకు విస్తృతశ్రేణిలో హెమ్‌ ఇంటీరియర్‌ పరిష్కారాలను అందించగలదు.

 
దక్షిణ భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరించాలనే కంపెనీ యొక్క వ్యూహాత్మక కార్యక్రమాలకనుగుణంగా ఈ నూతన స్టూడియో ప్రారంభించారు.  ఆంధ్రప్రదేశ్‌లో రెండవ అతి పెద్ద నగరం విజయవాడ. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ ఇది. ఈ స్టూడియో ద్వారా  రాష్ట్ర రాజధాని గుంటూరులో అభివృద్ధికి తోడ్పడుతూ ఆధునిక, మాడ్యులర్‌ హెమ్‌ ఇంటీరియర్‌ అవసరాలను తీర్చనున్నారు. ఈ మార్కెట్‌లో డిమాండ్‌ను తీర్చేందుకు ఈ స్టూడియో కోసం 10 మందిని హోమ్‌లేన్‌ ఉద్యోగాలలోకి తీసుకుంది.

 
ఈ విస్తరణ గురించి హోమ్‌ లేన్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌-గ్రోత్‌ అండ్‌ రిటైల్‌ శ్రీ సుబోధ్‌ జైన్‌ మాట్లాడుతూ, ‘‘హోమ్‌లేన్‌ వద్ద తమ లక్ష్యం ఎప్పుడూ కూడా మా వినియోగదారుల కోసం వ్యక్తిగతీకరించిన గృహాలను స్ధిరమైన ధరలు, ఊహాజనిత సమయంల వద్ద అందించడంగా ఉంటుంది. విజయవాడలో మా సేవలను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ రంగం గత సంవత్సరంతో పోలిస్తే 35% వృద్ధిని నమోదు చేయడంతో పాటుగా మరింతగా వృద్ధి చెందుతుందని అంచనా. నగరంలో హోమ్‌ ఇంటీరియర్‌ పరిష్కారాల కోసం వృద్ధి చెందుతున్న డిమాండ్‌కు ఇది తోడ్పాటునందిస్తుంది. మా డిజైన్‌ నిపుణులు, మా వైవిధ్యమైన  పోర్ట్‌ఫోలియోతో వినియోగదారులు ఎలాంటి అసౌకర్యంకు గురికాకుండా తమ కలల ఇంటిని సృష్టించుకోగలరు’’ అని అన్నారు.

 
ఈ స్టూడియో గురించి హోమ్‌లేన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌- బిజినెస్‌- శ్రీ సోలోమన్‌ ధీరజ్‌ ముడిమల మాట్లాడుతూ, ‘‘గత దశాబ్ద కాలంలో, మాడ్యులర్‌ హోమ్‌ ఇంటీరియర్స్‌కు డిమాండ్‌ గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ఖర్చు చేసే సామర్ధ్యం గణనీయంగా పెరగడంతో పాటుగా మరింతగా వ్యక్తిగతీకరించిన ప్రాంగణాలను కోరుకుంటూ తమ ప్రాధాన్యతలను మార్చుకోవడం కూడా దీనికి తోడ్పడుతుంది. ఈ కోణంలో విజయవాడ అత్యంత నమ్మకమైన మార్కెట్‌. ఇక్కడ నూతన తరపు వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని, మేము ఈ స్టూడియోను విస్తృతశ్రేణి పరిష్కారాలు, వైవిధ్యమైన డిస్‌ప్లే ఏర్పాట్లతో తీర్చిదిద్దాము. ఇక్కడ వారు తమకు నచ్చిన వస్తువులను తాకడం, వాటి అనుభవాలను పొందడం, వాటి నుంచి స్ఫూర్తి పొందడం చేయవచ్చు’’ అని అన్నారు.