గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (14:58 IST)

కుమార్తెపై అత్యాచారం.. కడుపు నొప్పి రావడంతో..

ఏపీలో తూర్పు గోదావరి జిల్లా పామర్రుకు చెందిన మహిళ కొద్దిరోజుల క్రితం నగరానికి వలస వచ్చింది. పంజాగుట్ట పరిధిలో ఉంటూ స్థానికంగా ఇళ్లలో పనులు చేస్తూ జీవనం సాగిస్తోంది. ఆమె భర్త, కుమార్తె (18) స్వస్థలంలోనే ఉంటున్నారు. 
 
ఇటీవల కుమార్తెకు కడుపు నొప్పి రావడంతో.. నగరానికి తీసుకొచ్చి ప్రైవేటు ఆసుపత్రిలో చూపగా గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో కుమార్తెను తీసుకొని ఆమె తల్లి పంజాగుట్ట ఠాణాకు వచ్చి ఫిర్యాదు చేసింది.

ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు యువతి పోలీసుల విచారణలో తెలిపింది.