గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (12:50 IST)

లలిత్ మోదీతోనూ అఫైర్.. మాజీ ప్రియుడితో షాపింగ్.. ఇదంతా..?

sushmita - rohanan
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ అఫైర్లతో వార్తల్లో నిలుస్తోంది. తన కంటే చాలా చిన్నవాడైన రోమాన్ షాల్‌తో ఆమె ప్రేమాయణం నడిపిన సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు వీరి సహజీవనం కొనసాగింది. ఇటీవలే వీరిద్దరూ విడిపోయారు. ఇది జరిగి నెల రోజులు కూడా గడవకుండానే లలితో మోదీతో డేటింగ్ ప్రారంభించింది. వీరిద్దరి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలు చూసి అందరూ షాక్ అయ్యారు. 
 
అయితే, లలిత్ మోదీతో బంధాన్ని కొనసాగిస్తూనే, తన మాజీ లవర్ రోమాన్‌తో కలిసి ఆమె మీడియా కంట పడింది. అతనితో కలసి సుస్మిత షాపింగ్‌కు వెళ్లింది. అంతేకాదు, వీరితో పాటు సుస్మిత పెంపుడు కుమార్తె రేనీ కూడా ఉంది. వీరు ముగ్గురూ కలిసి ఫొటోలకు ఫోజులు కూడా ఇచ్చారు. దీనిపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.