1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (13:24 IST)

సల్మాన్ ఖాన్ శాడిస్ట్.. అందరినీ కొట్టేవాడు.. సల్మాన్ మాజీ ప్రేయసి

Salman khan
Salman khan
బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌పై ఆయన మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు చేసింది. సల్మాన్ ఖాన్ మొదట సూరజ్ బర్జత్య దర్శకత్వంలో మైనే ప్యార్ కియా సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.
 
అంతేకాకుండా తొమ్మిదేళ్లపాటు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలను అందించిన ఏకైక హీరో సల్మాన్ ఖాన్. తాజాగా సల్మాన్ ఖాన్ పై అతని మాజీ ప్రేయసి శాడిస్ట్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
సల్మాన్ ఖాన్ గురించి అతనితో డేటింగ్ చేసిన మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు చేసింది. తనతో పాటుగా ఇతర మహిళలను కూడా సల్మాన్ ఖాన్ కొట్టేవాడు. 
 
అతని గురించి గొప్పగా చెప్పడం మానేయండి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.  కాగా గతంలో కూడా ఐశ్వర్యరాయ్ ని సల్మాన్ ఖాన్ కొట్టినట్లుగా పెద్ద ఎత్తున వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.