సోమవారం, 9 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (10:39 IST)

పొలంలో హాయిగా నిద్రపోతుంటే.. వీపు మీద పాము పడగ విప్పింది..

Snake
Snake
పొలం పనులు ముగించుకుని హాయిగా నిద్రపోయింది. ఎంత హాయిగా నిద్రపోయిందంటే.. పాము పైన బడినా పట్టించుకోలేనంత. పొలం పనులు ముగించుకుని ఓ చెట్టు కింద నిద్రిస్తున్న మహిళపైకి పాము వచ్చి పడగ విప్పింది. దాదాపు గంట పాటు ఆమెపై పడగ విప్పి తిష్టవేసింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. కానీ ఆ మహిళ అదృష్టం బాగుండి పాము కాటు నుంచి ఆ మహిళ చాకచక్యంగా తప్పించుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని కలబురగి జిల్లా అఫ్జల్‌పురాలోని మల్లబ గ్రామంలో చోటుచేసుకుంది. 
 
పాము ఆమె పైకి రావడంతో మెలుకువ వచ్చిన ఆమె.. కదలకుండా ఉండిపోయింది. ఎలాంటి హాని తలపెట్టకుండా గంట తర్వాత వెళ్లిపోవడంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఈ దృశ్యాలను స్థానికుడు ఒకరు ఫోన్‌లో రికార్డు చేసి సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. దీంతో ఆ వీడియో వైరల్‌ అవుతుంది.