సోమవారం, 15 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2022 (08:00 IST)

యాక్షన్ థ్రిల్లర్‌గా సుధీర్ బాబు హంట్

Sudheer Babu
Sudheer Babu
సుధీర్ బాబు కథానాయకుడిగా భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనంద ప్రసాద్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  మహేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పోలీస్ నేపథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి 'హంట్' టైటిల్ ఖరారు చేసినట్లు ఈ రోజు వెల్లడించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాత వి. ఆనంద ప్రసాద్ మాట్లాడుతూ "సుధీర్ బాబు ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌ రోల్‌లో కనిపించనున్న చిత్రమిది. ఆయనతో పాటు శ్రీకాంత్, 'ప్రేమిస్తే' భరత్ పోలీస్ ఆఫీసర్లుగా చేస్తున్నారు. ఈ ముగ్గురూ క్లోజ్ ఫ్రెండ్స్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. చాలా స్టైలిష్ ఫిల్మ్. ఇప్పటి వరకు వచ్చిన సుధీర్ బాబు సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సులు చాలా సహజంగా, కొత్త అనుభూతి ఇచ్చేలా ఉంటాయి. కనిపించని శత్రువు కోసం జరిపే వేట ఈ సినిమా ప్రధాన కథాంశం. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తాం. 'ప్రేమిస్తే' భరత్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రమిది. కథ విన్న వెంటనే ఎగ్జైట్ అయ్యి ఓకే చెప్పారు. శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కూడా బావుంటుంది'' అని అన్నారు. 
 
సుధీర్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్, భరత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మైమ్ గోపి, కబీర్ దుహన్ సింగ్, మౌనిక రెడ్డి, గోపరాజు రమణ, మంజుల, చిత్రా శుక్ల, సుపూర్ణ మల్కర్, సంజయ్ స్వరూప్, రవి వర్మ, 'జెమినీ' సురేష్, అభిజీత్ పూండ్ల, కోటేష్ మన్నవ, సత్య కృష్ణన్ తదితరులు ఇతర తారాగణం.
 
సాంకేతిక వర్గం :ఆర్ట్ డైరెక్టర్ : వివేక్ అన్నామలై, కాస్ట్యూమ్ డిజైనర్ : రాగ రెడ్డి, యాక్షన్ : రేనౌడ్ ఫవేరో (యూరోప్), స్టంట్స్ : వింగ్ చున్ అంజి, ఎడిటర్ : ప్రవీణ్ పూడి, సినిమాటోగ్రఫీ : అరుల్ విన్సెంట్‌, సంగీతం : జిబ్రాన్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : అన్నే రవి, నిర్మాత : వి. ఆనంద ప్రసాద్, దర్శకత్వం : మహేష్.