శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2022 (07:39 IST)

మార్కెట్‌లోకి రాయల్ హంటర్ 350 బైక్

royal hunter 350
రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ కొత్తగా రాయల్ హంటర్ 350 పేరుతో సరికొత్త బైకును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. బైకులు నడపాలనే కోరిక ఉడి, బరువు, ఎత్తు దృష్ట్యా నడపలేని కొనుగోలుదారులను ప్రత్యేకంగా ఆకర్షించేలా ఈ బైకు రూపకల్పన చేశారు. మెట్రో, రెట్రో పేర్లతో ఈ బైకును తీసుకొచ్చారు. 
 
హంటర్ 350 ధర రూ.1,49,900 నుంచి రూ.1,67,757గా ఉంటుందని ఆ కంపెనీ బిజినెస్ హెడ్ వి.జయప్రదీప్ తెలిపారు. ఈ బైకులను ప్రధానంగా పట్టణ ప్రాంత యువతను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేసినట్టు తెలిపారు. 350 సీసీ జే సిరీస్ ఇంజన్ ఫ్లాట్‌ఫాంపై దీన్ని తయారు చేసినట్టు తెలిపారు. 
 
ఈ బైకులు మార్కెట్‌లోకి విడుదల చేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ, రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీకి తెలుగు రాష్ట్రాల మార్కెట్ ఎంతో కీలకమన్నారు. కంపెనీ దేశయ బైక్‌ల విక్రయాల్లో 10 శాతం విక్రయాలు ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే జరుగుతున్నాయని చెప్పారు. దేశీయంగా గత యేడాది 5.7 లక్షల బైకులను విక్రయించినట్టు ఆయన తెలిపారు.