గురువారం, 21 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 ఆగస్టు 2025 (21:37 IST)

Rajesh Sakariya: ఢిల్లీ ముఖ్యమంత్రిపై దాడి.. నిందితుడిపై దశాబ్ధాల పాటు కేసులున్నాయిగా!

Rekha Gupta
Rekha Gupta
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తన నివాసంలో ఆమెపై జరిగిన దాడి ఘటన అందరికీ షాకిచ్చింది. నిందితుడిని గుజరాత్‌లోని రాజ్‌కోట్‌కు చెందిన 41 ఏళ్ల రాజేష్ ఖిమ్జీ సకారియాగా గుర్తించారు. అతన్ని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.
 
గత దశాబ్దంలో సకారియాపై దాడి ఆరోపణల నుండి గుజరాత్ నిషేధ చట్టం ఉల్లంఘనల వరకు అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయని కోర్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. అయితే, చాలా వరకు సాక్ష్యాలు లేవని కోర్టులు పదే పదే పేర్కొంటూ అతనిని విడుదల చేశాయి.
 
అతని మొదటి ప్రధాన కేసు 2017 నాటిది.. ఆ తర్వాత పదులకు పైగా కేసులు నమోదైనాయి. మొత్తం మీద, రాజేష్ సకారియా 2017- 2024 మధ్య ఐదు ప్రధాన కేసులను ఎదుర్కొన్నాడు. నాలుగు సార్లు నిర్దోషిగా విడుదలయ్యాడు.