1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Odisha IPS officers’ daughter undergoes sex-change operation

ఐపీఎస్ దంపతుల కుమార్తెను పురుషుడిగా మార్చేశారు.. ఎలా?

Odisha IPS Officers
ఒడిశా రాష్ట్రంలో ఓ అరుదైన కేసు ఒకటి వెలుగు చూసింది. ఐపీఎస్ దంపతులు తమ కుమార్తెకు లింగ మార్పిడి చికిత్స చేయించారు. అంటే, అమ్మాయిని అబ్బాయిగా మార్చారు. ఒడిశాకు చెందిన ఈ ఐపీఎస్ దంపతుల సమ్మతితో 22 యేళ్ళ కుమార్తెకు ఈ లింగ మార్పిడి శస్త్రచికిత్స (సెక్స్ రీ అసైన్‌మెంట్ సర్జరీ)ని విజయవంతంగా పూర్తి చేశారు. 
 
ఈ అరుదైన కేసు గురించి ఐపీఎస్ దంపతుల కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించిన సమాచారం మేరకు.. ఈ లింగమార్పిడి ఆపరేషన్ ఇటీవల ఢిల్లీలో జరిగింది. ఆ తర్వాత డాక్యుమెంట్లు, పాస్‌పోర్టు‌లోనూ లింగమార్పిడి కోసం చర్యలు చేపట్టారు. అయితే, ఈ ఆపరేషన్ ఎపుడో జరిగింది. పైగా, లింగ మార్పిడి చేయించుకున్న యువతి ప్రస్తుతం అమెరికాలో మేనేజ్మెంట్ స్టడీస్ చేస్తోంది. 
 
ఈ సర్జరీ తర్వాత పూర్తిగా పురుష హార్మోన్లు అభివృద్ధి చెందడానికి కనీసం రెండేళ్ళ సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. "లింగమార్పడి చికిత్స చేయించుకున్న వారు జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ)ను ఎదుర్కొంటారు. మహిళ పురుషుడిగా ప్రవర్తించవచ్చు. అయినా కానీ మహిళా క్రోమోజోముల కారణంగా పురుషల పట్ల ఆకర్షణ కొనసాగుతుందని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ లింగ మార్పిడి విధానంలో పురుషుడిని మహిళగా మార్చడం కంటే.. మహిళను పురుషుడుగా మార్చడం సులభతరమని వైద్యులు అంటున్నారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
కుమార్తెపై అత్యాచారం.. కడుపు నొప్పి రావడంతో..